Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

పూర్ణ మార్కెట్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసాను కల్పించిన జీవీఎంసీ కమిషనర్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పూర్ణ మార్కెట్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసాను కల్పించిన జీవీఎంసీ కమిషనర్.

వార్త ముఖ్యాంశాలు

  • పూర్ణ మార్కెట్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసాను కల్పించిన జీవీఎంసీ కమిషనర్.
  • *విశాఖపట్నం డిసెంబర్పు 23 పున్నమి ప్రతినిధి* పూర్ణ మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.
  • మంగళవారం ఆయన సోమవారం అర్ధరాత్రి విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.

పూర్ణ మార్కెట్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసాను కల్పించిన జీవీఎంసీ కమిషనర్.

*విశాఖపట్నం డిసెంబర్పు 23 పున్నమి ప్రతినిధి* పూర్ణ మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన సోమవారం అర్ధరాత్రి విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ పూర్ణ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, దుకాణాలు ఇంకా అక్కడక్కడ కాలుచుండడం గమనించి వెంటనే జిల్లా అగ్నిమాపక అధికారితో మాట్లాడి ఫైర్ ఇంజన్ తో మిగిలిన మంటలను ఆర్పే ఏర్పాట్లను చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో పేరుకుపోయిన వ్యర్థాలను యుద్ద ప్రాతిపాదికన తొలగించే ప్రక్రియ ప్రారంభించాలని జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు ను ఆదేశించారు.

అనంతరం అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 15 దుకాణాల బాధితులను ఓదారుస్తూ వారికి భరోసాను కల్పించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అన్ని విధాల న్యాయం జరిగేలా తగిన చర్యలు చేపడతామని బాధితులకు భరోసాను కల్పించారు.

ఈ పర్యటనలో జీవీఎంసీ కార్య నిర్వహక ఇంజనీరు వెంకటేశ్వరరావు, జీవీఎంసీ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *