Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

పుంగనూరులో ఉద్రిక్తత: వైకాపా–టీడీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి.. వాహనాలు ధ్వంసం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పుంగనూరులో ఉద్రిక్తత: వైకాపా–టీడీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి.. వాహనాలు ధ్వంసం!

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

పుంగనూరు, అక్టోబర్ 16 (భాను ప్రసాద్ నాయుడు, పున్నమి న్యూస్ ప్రతినిధి):
పుంగనూరు పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ల దాఖలు కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణగా మారి పరస్పరం రాళ్ల దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా, వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
వైకాపా అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ల కేంద్రం వద్దకు రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి చేరుకున్నారు. అదే సమయంలో అటు టీడీపీ, ఇటు వైకాపా అభ్యర్థులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి నామినేషన్లు వేసేందుకు ఒకేసారి తరలిరావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. క్షణాల్లో పరిస్థితి అదుపుతప్పి ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడిలో అక్కడ నిలిపి ఉంచిన స్కార్పియో తదితర వాహనాల అద్దాలు పూర్తిగా పగిలిపోయి ధ్వంసమయ్యాయి. వాహనాలపై ఉన్న బారికేడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో పట్టణంలో భయానక వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Uploaded Video:

పుంగనూరులో ఉద్రిక్తత: వైకాపా–టీడీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి.. వాహనాలు ధ్వంసం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *