Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

పాల్వంచ మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సీఆర్‌పీ శెట్టిపల్లి ప్రభాకర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పాల్వంచ మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సీఆర్‌పీ శెట్టిపల్లి ప్రభాకర్

వార్త ముఖ్యాంశాలు

  • పాల్వంచ: పాల్వంచ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యానంబైలుకు చెందిన సీఆర్‌పీ శెట్టిపల్లి ప్రభాకర్ను పాల్వంచ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు.
  • ఈ అవార్డును పాల్వంచ మండల ఎంఈఓ ప్రదానం చేయగా, జెడ్పీహెచ్‌ఎస్ యానంబైలు ప్రధానోపాధ్యాయులు బి.

పాల్వంచ: పాల్వంచ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యానంబైలుకు చెందిన సీఆర్‌పీ శెట్టిపల్లి ప్రభాకర్ను పాల్వంచ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు.
ఈ అవార్డును పాల్వంచ మండల ఎంఈఓ ప్రదానం చేయగా, జెడ్పీహెచ్‌ఎస్ యానంబైలు ప్రధానోపాధ్యాయులు బి. ప్రకాశరావు పాల్గొని సీఆర్‌పీ ప్రభాకర్‌ను అభినందించారు. విద్యార్థులకు, పాఠశాలలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించడం పట్ల పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు సీఆర్‌పీ ప్రభాకర్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *