Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాలవాగు సమీపంలో శవమైన ఎలక్ట్రిషియన్.. ఘటనాస్థలంలో ఎమ్మెల్యే కాకర్ల.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాలవాగు సమీపంలో శవమైన ఎలక్ట్రిషియన్.. ఘటనాస్థలంలో ఎమ్మెల్యే కాకర్ల.
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు మండలంలోని వింజేటమ్మకొండ మార్గంలో పాలవాగు సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది.
  • సమాచారం అందుకున్న వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పోలీసు అధికారులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు.
  • ఘటనాస్థలంలో లభించిన ఆధార్ కార్డు,బైక్ నంబర్ ఆధారంగా మృతుడు కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్ శ్రీకాంత్‌గా గుర్తించారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం శ్రీకాంత్ శనివారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు.ఈరోజు ఉదయం అటుగా వెళ్లిన పశువుల కాపరులు మృతదేహాన్ని…

వింజమూరు మండలంలోని వింజేటమ్మకొండ మార్గంలో పాలవాగు సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పోలీసు అధికారులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. ఘటనాస్థలంలో లభించిన ఆధార్ కార్డు,బైక్ నంబర్ ఆధారంగా మృతుడు కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్ శ్రీకాంత్‌గా గుర్తించారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం శ్రీకాంత్ శనివారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు.ఈరోజు ఉదయం అటుగా వెళ్లిన పశువుల కాపరులు మృతదేహాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించగా,వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.మృతికి గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు.ఇది ప్రమాదవశాత్తు జరిగిందా,లేక మరేదైనా అనుమానాస్పద పరిస్థితులున్నాయా అనే దానిపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *