Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత

పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 25, కడప:

కడప నగరంలోని ఆర్కే నగర్‌లో 4వ డివిజన్‌కు సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, ఈస్ట్ జోన్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ప్రతి డివిజన్‌లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పాలనలోని వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అధికారం శాశ్వతం కాదని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. కడప నగరంలోని 66 డివిజన్లలో పార్టీని మరింత బలోపేతం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు అందజేస్తామని తెలిపారు.

కడప ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం తప్ప నగర అభివృద్ధికి చేసిన పని శూన్యమని అంజాద్ బాషా విమర్శించారు. కడప నగర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కేవలం మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేయించారో, ఏయే అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చారో కడప ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో, తీసుకొచ్చిన నిధులు ఎంతమేరకు ఉన్నాయో ప్రజల ముందుకు తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ ఆర్.వి. రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ రెడ్డి, రాయలసీమ జోన్ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, నాయకులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, గాని తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *