వార్త ముఖ్యాంశాలు
- -ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో విజయం సాధిస్తా..
- గాలి వెంకటేశ్వర్లు పామూరు: పామూరు మండల రెండో ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా గాలి వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
-ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో విజయం సాధిస్తా.. గాలి వెంకటేశ్వర్లు
పామూరు: పామూరు మండల రెండో ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా గాలి వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలే తనకు కొండంత బలమని అన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి, అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయడానికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఆదరించి, జనసేన పార్టీ అభ్యర్థిగా తన విజయానికి సహకరించాలని పామూరు రెండో ఎంపీటీసీ పరిధిలోని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు.