పామూరు అక్టోబర్ 16(పున్నమి న్యూస్ ). పామూరు లో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వాల్మీకి మహర్షి ఆలయ నిర్మాణ పనులు వేగవంతం అయి, నిర్మాణ పూర్తి దశలో వుంది.వాల్మీకి మహర్షిపై వున్న భక్తి శ్రద్దలతో నిర్మాణ పనులు వేగవంతంచేసే దిశలో పనులు వేగవంతం చేశారని భక్తులు కొనియాడారు.వాల్మీకి మహర్షి బోధించిన ధర్మం, సత్యం, నీతి అన్ని వర్గాల, అన్ని కులాల ప్రజలకు మార్గదర్శం అని కొనియాడారు.ఆలయ నిర్మాణం త్వరగా పూర్తిచేసి భక్తులకు, పూజా కార్యక్రమాలకు అందుబాటులో ఉంచాలని భక్తులు కోరారు.పామూరు పట్టణంలో వాల్మీకి మహర్షి ఆలయ నిర్మాణం జరిగితే గ్రామంలో ఆధ్యాత్మిక శోభ మరింతగా పెరిగే అవకాశం ఉందని భక్తుల నమ్మకం.ఎంతో చారిత్రకత కల్గిన వాల్మీకి మహర్షి రాతిగుడి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడ లేదు, అది కేవలం పామూరు పట్టణంలోనే అని చరిత్రకారులు చెప్పిన సాక్ష్యం.
