అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ టి. నిశాంతి బుధవారం పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల విధుల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను, పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సామగ్రి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పంపిణీ ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సామగ్రి సక్రమంగా అందేలా చూడాలని, సిబ్బంది సురక్షితంగా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.


వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన