వార్త ముఖ్యాంశాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో రేపు (5న) జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లు, ప్రజల సౌకర్యార్థం ఫిర్యాదులు, సందేహాల కోసం జిల్లా ఎన్నికల యంత్రాంగం సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచింది.
- ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా పాడేరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ (9560334841)ను సంప్రదించవచ్చు.
- జిల్లా ఎన్నికల పరిశీలకులు రోణంకి కూర్మనాథ్ (7989108836), ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్ హన్స్ (9440810124) అందుబాటులో ఉంటారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రేపు (5న) జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లు, ప్రజల సౌకర్యార్థం ఫిర్యాదులు, సందేహాల కోసం జిల్లా ఎన్నికల యంత్రాంగం సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచింది. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా పాడేరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ (9560334841)ను సంప్రదించవచ్చు. జిల్లా ఎన్నికల పరిశీలకులు రోణంకి కూర్మనాథ్ (7989108836), ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్ హన్స్ (9440810124) అందుబాటులో ఉంటారు. పరిశీలకులను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం షేక్ హుస్సేన్ (9848743789)ను సంప్రదించాలి. ప్రజల సౌకర్యార్థం మండల స్థాయి ఎన్నికల హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. సంబంధిత మండలాల ప్రజలు ఆయా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి, ఫిర్యాదులు, సమాచారం పొందవచ్చని అధికారులు సూచించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన