Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పవన్ కళ్యాణ్ పై మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అంజూరు చక్రధర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పవన్ కళ్యాణ్ పై మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అంజూరు చక్రధర్

వార్త ముఖ్యాంశాలు

  • జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్వరంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ హైదరాబాద్ వెళ్ళిన సందర్భాన్ని కూడా వక్రీకరిస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం వైసీపీ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తన సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ని విమర్శించడాన్ని,జనసేన పార్టీ ఉమ్మడి…

జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్వరంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ హైదరాబాద్ వెళ్ళిన సందర్భాన్ని కూడా వక్రీకరిస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం వైసీపీ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తన సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ని విమర్శించడాన్ని,జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ,ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం తో పాటు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వైద్య రంగానికి 19,265 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు.మీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ల ను ఏ విధంగా అవమానించారో,ప్రజలకు తెలుసు అని,సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని విషయాలకు కచ్చితంగా సమాధానం చెప్తారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *