Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.. గిరిజన కాలనీలో పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.. గిరిజన కాలనీలో పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు రోజులపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
  • సర్వేపల్లి ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ వాణి భవాని నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
  • తొలిరోజు నాగంట్ల గిరిజన కాలనీలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు రోజులపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. సర్వేపల్లి ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ వాణి భవాని నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నాగంట్ల గిరిజన కాలనీలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *