వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 3 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: పల్లె పండుగ-3లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి రూ.11 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.
- మనుబోలు మండలానికి పల్లె పండుగ నిధులు రూ.2 కోట్లు, నుడా నిధులతో కలిపి రూ.3.80 కోట్లు కేటాయించామన్నారు.
- మనుబోలు పంచాయతీలో రూ.25 లక్షల పనులకు శంకుస్థాపన, జట్లకొండూరులో రూ.40 లక్షల తాగునీటి పథకాన్ని ప్రారంభించారు.
ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 3 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: పల్లె పండుగ-3లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి రూ.11 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మనుబోలు మండలానికి పల్లె పండుగ నిధులు రూ.2 కోట్లు, నుడా నిధులతో కలిపి రూ.3.80 కోట్లు కేటాయించామన్నారు. మనుబోలు పంచాయతీలో రూ.25 లక్షల పనులకు శంకుస్థాపన, జట్లకొండూరులో రూ.40 లక్షల తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని, రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు అందిస్తున్నామని సోమిరెడ్డి పేర్కొన్నారు.