Date:03-10-2026
(పున్నమి ప్రతినిధి )
దుత్తలూరు మండలం నందిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరగాల్సిన స్కూల్ చైర్మన్ ఎన్నికలు ఇరువర్గాల మధ్య వివాదం, ఘర్షణ కారణంగా వాయిదా పడ్డాయి.
ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ముందు జరిగిన పరిణామాలపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల సందర్భంగా తల్లిదండ్రులు,మరియు ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
