Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

పదో తరగతి విద్యార్థులకు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పదో తరగతి విద్యార్థులకు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ*

వార్త ముఖ్యాంశాలు

  • *పదో తరగతి విద్యార్థులకు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ* *ఆర్థిక సాయ‌మందించిన ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న విశాఖవాసి రామ్ గోపాల్ *విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి * ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య శాఖ జారీ చేసిన వందరోజుల ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా ప‌దో తరగతి పరీక్షల స్టడీ…
  • హరేంధిర ప్రసాద్ శుక్రవారం అంద‌జేశారు.
  • వీటి కొర‌కు ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న విశాఖవాసి రామ్ గోపాల్ నిధులను స‌మ‌కూర్చారు.

*పదో తరగతి విద్యార్థులకు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ*

*ఆర్థిక సాయ‌మందించిన ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న విశాఖవాసి రామ్ గోపాల్

*విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి * ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య శాఖ జారీ చేసిన వందరోజుల ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా ప‌దో తరగతి పరీక్షల స్టడీ మెటీరియల్‌ను సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం అంద‌జేశారు. వీటి కొర‌కు ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న విశాఖవాసి రామ్ గోపాల్ నిధులను స‌మ‌కూర్చారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సహకారం అందించిన దాతను ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ అభినందించారు. ఈ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల‌ని, పరీక్షల్లో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. వసతి గృహాల్లోని విద్యార్థులందరూ వంద‌ శాతం ఉత్తీర్ణత సాధించేలా కష్టపడి చదవాలని సూచించారు.

కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. రామారావు, సహాయ సంక్షేమ అధికారి ఆర్. శ్యామల, ఇత‌ర అధికారులు సత్యవతి, మహేంద్ర మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *