ఖానాపురం మండలం ధర్మరావుపేట గ్రామాల లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటునమోదు కార్యక్రమంలో పాల్గొని పలువురు పట్టబద్రులను ఓటు నమోదు ప్రక్రియ గురించివివరించారు.ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు బాబు మాట్లాడుతూ
గతంలో ఓటు వేసిన పట్టాభద్రులు గానీ కొత్తగా అర్హత కలిగిన పట్టబద్రులు గాని ప్రతి ఒక్కరు 18 ఫామ్ నింపి అప్లికేషన్ చేసుకోవాలని
అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్క పట్టభద్రులు అయినటువంటి వారి దగ్గరికి స్వయంగా వెళ్లి అవగాహన కల్పించి వారిని ఓటు అప్లికేషన్ చేసుకునే విధంగా సంఘటితం చేయాలని కోరుకున్నారు.మరియు పిఎసిఎస్ చైర్మన్ శ్రీ వల్లే శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ
స్థానిక గ్రామాలలో అందుబాటులో లేని పట్టభద్రులు ఎవరైనా వారి వివరాలు కాంగ్రెస్ పార్టీ నియమించిన ఎన్నికల కోఆర్డినేటర్లకు పంపిస్తే నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కౌంటర్ ఏర్పాటు చేయడం అయినది కావున ఎవరైనా అందుబాటులో లేని పటబద్రులు మన ఖానాపురం మండల లోని అన్ని గ్రామాలకు ఎన్నికల కోఆర్డినేటర్లుగా నాము మరియు ఖానాపురం మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి కోడి మల్లేష్ యాదవ్ గారిని కలిసి సంబంధించిన పత్రాలు ఇస్తే వారే స్వయంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీ ఓటును నమోదు ప్రక్రియ చేపిస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఖానాపురం మండల కోఆర్డినేటర్ కోడి మల్లేష్ యాదవ్,బుదిరావుపేట సర్పంచ్
పెసరు రాణి-గోవర్ధన్ రెడ్డి,TG యూత్ జాయింట్ సెక్రెటరీ మూడెం ఎల్లాగౌడ్, మాజీ ఎంపిటిసి బిక్కి మురళి, రజనీకాంత్,ధర్మారావుపేట గ్రామ పార్టీ అధ్యక్షులు ముధురు కుమారస్వామి, యూత్ అధ్యక్షులు నవీన్, కార్యదర్శి లెంకలపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు
