Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

పట్టపగలే మారికవలసలో చోరీయత్నం.. స్థానికుల అప్రమత్త తో ముగ్గురు యువకులు పట్టివేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పట్టపగలే మారికవలసలో చోరీయత్నం.. స్థానికుల అప్రమత్త తో ముగ్గురు యువకులు పట్టివేత

విశాఖపట్నం జిల్లా,మధురవాడ (పున్నమి ప్రతినిధి):** నవంబర్ 17::

విశాఖ నగరంలోని మధురవాడ మారికవలసలో పట్టపగలే చోరీకి యత్నించిన ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారికవలసకు చెందిన గరికిన సత్యవతి (53) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ముగ్గురు యువకులు చొరబడ్డారు. ఇద్దరు బయట కాపలాగా ఉండగా, మరొకరు ఇంట్లోకి ప్రవేశించి రూ.3,500 నగదు, ఒక జత వెండి పట్టీలు, ఆరు బంగారు గాజులను అపహరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇంతలో ఇంటికి చేరుకున్న యజమానురాలు వారిని గమనించి కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ముగ్గురినీ పట్టుకుని పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పీఎం పాలెం క్రైమ్ ఎస్ఐ సూర్యప్రకాష్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విశాఖకు చెందిన అంజూరి సాయి సూర్య (19), వల్లూరి యశ్వంత్ (19), ఎద్దు సుశాంత్ అలియాస్ చెర్రీ (19)గా గుర్తించారు. వీరిపై గతంలో ఆరిలోవ, త్రీటౌన్, ఎంవీపీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

**సిరంజీలపై ప్రచారం.. పోలీసుల స్పష్టత!**

నిందితుల వద్ద ఖాళీ సిరంజీలు, లిప్‌స్టిక్‌లు లభించడంతో డ్రగ్స్ ముఠా అంటూ స్థానికంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్పందించిన పీఎం పాలెం క్రైమ్ సీఐ బి.ఎస్.ఎస్. ప్రకాష్.. అవి డయాబెటిస్ రోగులు ఉపయోగించే సాధారణ ఖాళీ సిరంజీలు, పెదవులకు రాసుకునే లిప్‌స్టిక్‌లు మాత్రమేనని స్పష్టం చేశారు. వాటిని డ్రగ్స్‌గా భావించి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే జరిగిన ఈ చోరీ యత్నాన్ని స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.

పట్టపగలే మారికవలసలో చోరీయత్నం.. స్థానికుల అప్రమత్త తో ముగ్గురు యువకులు పట్టివేత

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *