వార్త ముఖ్యాంశాలు
- --- 3 విడతల్లో షెడ్యూల్ : 3 విడతల్లో ఎన్నికలు --- సర్పంచ్‌కు తెలుపు బ్యాలెట్ -- వార్డు సభ్యులకు గులాబీ బ్యాలెట రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికలకు కూడా…
- 3 విడతల్లో షెడ్యూల్ విడుదల చేసి, 3 విడతల్లోనే ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది.
- మొదటి విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 13న విడుదల చేసి, నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనుంది.
— 3 విడతల్లో షెడ్యూల్ : 3 విడతల్లో ఎన్నికలు
— సర్పంచ్‌కు తెలుపు బ్యాలెట్
— వార్డు సభ్యులకు గులాబీ బ్యాలెట
రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికలకు కూడా నగారా మోగించింది. 3 విడతల్లో షెడ్యూల్ విడుదల చేసి, 3 విడతల్లోనే ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది.
మొదటి విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 13న విడుదల చేసి, నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన నామినేషన్లను నవంబర్ 15 నుంచి 17 వరకు స్వీకరించనుండగా, ఉపసంహరణకు నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఇచ్చింది.
ఇక 2వ విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 18న విడుదల చేసి, నవంబర్ 29న పోలింగ్ నిర్వహించనుంది. 2వ విడతకు నామినేషన్లను నవంబర్ 18 నుంచి 20 వరకు స్వీకరించి, నవంబర్ 24 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు వ్యవధి నిర్ణయించింది.
ఇక 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, డిసెంబర్ 2న ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. 3వ విడత నామినేషన్లను నవంబర్ 21 నుంచి 23 వరకు స్వీకరించనుండగా, నవంబర్ 27 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఇచ్చింది.
ఈ ఎన్నికలు 3 విడతలుగా జరగనుండగా, ఆయా ప్రాంతాల్లో ఉదయం 6:30 నుంచి పోలింగ్ మొదలై మధ్యాహ్నం 1 వరకు కొనసాగనుంది. పోలింగ్ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటించనుంది. సర్పంచ్ అభ్యర్థులకు తెలుపు బ్యాలెట్‌ను, వార్డు సభ్యులకు గులాబీ రంగు బ్యాలెట్లను కేటాయించనుంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్