వార్త ముఖ్యాంశాలు
- - కట్టుదిట్టమైన ఏర్పాట్లు - కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం ఈ నెల 5వ తేదీ గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఎంపిక చేసిన ఆయా కేంద్రాలలో ఈ నెల 7వ తేదీ శనివారం జరగనుంది.
- ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది.
– కట్టుదిట్టమైన ఏర్పాట్లు
– కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం
ఈ నెల 5వ తేదీ గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఎంపిక చేసిన ఆయా కేంద్రాలలో ఈ నెల 7వ తేదీ శనివారం జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. పోటీలో ఉన్న ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమ ఏజెంట్లను సిద్ధం చేసుకొని, వారికి అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకొని ఉన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. శనివారం రాత్రికి ఫలితాలు పూర్తిగా వెలువడనున్నాయి. జిల్లాలో 35 మండలాలు ఉండగా, పరిశీలనల తర్వాత 5 మండలాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 30 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, 35 మండలాల్లో ఏకగ్రీవాలు పోను మిగిలిన ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్