Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

న్యాయవాదులు తమ వృత్తితో పాటు పేదలకు న్యాయ సహాయం అందించాలి ఇది మీ సామాజిక బాధ్యత – కిషోర్ గునుకుల_జనసేన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
న్యాయవాదులు తమ వృత్తితో పాటు పేదలకు న్యాయ సహాయం అందించాలి ఇది మీ సామాజిక బాధ్యత – కిషోర్ గునుకుల_జనసేన

వార్త ముఖ్యాంశాలు

  • మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏఐడీఓ మోడల్ ఎగ్జామ్స్ నిర్వహించారు.
  • న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్న అభ్యర్థులు ఈ మాక్ ఎగ్జామ్స్‌లో పాల్గొని పరీక్ష విధానాలను అవగాహన చేసుకునే అవకాశాన్ని పొందారు.
  • ఈ సందర్భంగా పాల్గొన్న అభ్యర్థులకు ఏఐడీఓ పరీక్షల నమూనా ప్రశ్నాపత్రాలను అందించి, పరీక్షా విధానంపై అవగాహన కల్పిస్తూ మోడల్ పరీక్ష నిర్వహించారు.

మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏఐడీఓ మోడల్ ఎగ్జామ్స్ నిర్వహించారు. న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్న అభ్యర్థులు ఈ మాక్ ఎగ్జామ్స్‌లో పాల్గొని పరీక్ష విధానాలను అవగాహన చేసుకునే అవకాశాన్ని పొందారు.
ఈ సందర్భంగా పాల్గొన్న అభ్యర్థులకు ఏఐడీఓ పరీక్షల నమూనా ప్రశ్నాపత్రాలను అందించి, పరీక్షా విధానంపై అవగాహన కల్పిస్తూ మోడల్ పరీక్ష నిర్వహించారు.
కార్యక్రమానికి సహకరించి కళాశాల వేదికను అందించిన శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఏఐడీయూ మోడల్ ఎగ్జామ్ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యాజమాన్యం, డా.శ్రీ పెద్దసెట్టి సునీల్ గారిని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అభినందించారు.

కొత్తగా న్యాయ వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ న్యాయవాదుల కోసం మోడల్ ఎగ్జామ్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

రానున్న పరీక్షల్లో పాల్గొంటున్న అభ్యర్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

న్యాయవాదులు తమ వృత్తి బాధ్యతలతో పాటు కొంత సమయాన్ని పేదలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించేందుకు కేటాయించాలని పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ తరఫున పేదలకు న్యాయ సహాయం అందించడంలో సుమంత్ చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.

విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదని, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడంలో పెద్దసెట్టి సునీల్ గారు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.

ఇంటర్, డిగ్రీ, పీజీ చదువులను మధ్యలో ఆపేసిన లేదా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు కళాశాల యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.

సమాజంలో న్యాయం, విద్య అందరికీ చేరేలా ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *