Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణ

వార్త ముఖ్యాంశాలు

  • మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 19వ డివిజన్ మినీ బైపాస్ టిడిపి కార్యాలయం సమీప ప్రాంతాలలో బుధవారం పర్యటించారు.
  • ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన డ్రైను కాలువలలో మురుగు నీటి పారుదల నిర్వహణ తీరును కమిషనర్ పరిశీలించి, మరింత మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు అధికారులకు వివిధ సూచనలను జారీ చేశారు.
  • మినీ బైపాస్ ప్రాంతంలో చేపల విక్రయదారులు పరిధిని దాటి రోడ్లను ఆక్రమించకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.

మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 19వ డివిజన్ మినీ బైపాస్ టిడిపి కార్యాలయం సమీప ప్రాంతాలలో బుధవారం పర్యటించారు.

ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన డ్రైను కాలువలలో మురుగు నీటి పారుదల నిర్వహణ తీరును కమిషనర్ పరిశీలించి, మరింత మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు అధికారులకు వివిధ సూచనలను జారీ చేశారు.

మినీ బైపాస్ ప్రాంతంలో చేపల విక్రయదారులు పరిధిని దాటి రోడ్లను ఆక్రమించకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు కమిషనర్ సూచించారు. చేపల విక్రయదారులు నిర్దేశించిన రోడ్డు మార్జిన్ పరిధిలోనే విక్రయాలు జరుపుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా స్వచ్ఛందంగా దుకాణాలను వెనక్కి తగ్గించుకోవాలని వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డి.ఈ ప్రసాద్, ఏ.ఈ ఫాజిల్, టౌన్ ప్లానింగ్ విభాగం సర్వేయర్ కామేశ్వరరావు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *