Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ

నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో కేవలం 26 నెలల్లో సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు, అబివృద్ధి కి రూ 1.34 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది.
కూటమి పాలనలో రెండు సంవత్సరాల లో 67.47 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం క్రింద రూ.20,210 కోట్లు తల్లులు ఖాతాలో జమ చేయడం జరిగింది.స్త్రీ శక్తి పథకం కింద మహిళల కి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం.దీపం క్రింద ఏటా మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ,అన్నదాత సుఖీభవ పథకం క్రింద 46 లక్షల మంది రైతులకు రూ 12,110 కోట్లు,ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక భద్రత పెన్షన్ లకు రూ.73,507 కోట్లు వ్యయం చేయడం జరిగింది.
అదే విధంగా ప్రతి వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటూ మత్యకర సేవ పేరుతో నాట్యాకారులకు రూ.505 కోట్లు,ఆటో డ్రైవర్లు సేవ పేరుతో ఆటో డ్రైవర్లు కు రూ. 436 కోట్లు,చేనేత,గీత స్వర్ణ కారుల కు అనేక పథకాలు చేపట్టడం జరిగింది.
కూటమి పాలనలో 15,941 టీచర్లు,5,757 కానిస్టేబులు ఉద్యోగాలతో సహా అన్ని రంగాలలో కలసి 7,42 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమైనది.అమరావతిరాజధాని నిర్మాణం,పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పనులు జరిపిస్తుంది.రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం జరిగింది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ,ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి,ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల సహకారంతో పట్టణాల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.గత ప్రభుత్వం చెప్పి చేయలేదు.నేడు కూటమి ప్రభుత్వం చెప్పాం,చేస్తున్నాం కావున రాష్ట్ర ప్రజలు అందరూ నాటి వైసీపీ ప్రభుత్వ పాలనకు నేటి కూటమి పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించి స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *