Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్‌ 26 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి): పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు.
  • ఎల్లారపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఎస్‌ఐ జంపని కుమార్‌ పోలీస్‌ శాఖ విధులు, ఆయుధాలు, అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు.పోలీస్‌ స్టేషన్‌లో విధుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, శాఖలో ఉపయోగించే ఆయుధాలు, వాటి వినియోగం, భద్రతా జాగ్రత్తలను…
  • అత్యవసర సమయంలో డయల్‌ 112కు ఫోన్‌ చేస్తే సమాచారం స్వీకరించడం నుంచి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే వరకు అనుసరించే ప్రక్రియను తెలియజేశారు.

ఆయుధాలు, వైర్‌లెస్‌ వ్యవస్థ, డయల్‌ 112 సేవలపై అవగాహన

ఆత్మకూరు, అక్టోబర్‌ 26 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి): పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎల్లారపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఎస్‌ఐ జంపని కుమార్‌ పోలీస్‌ శాఖ విధులు, ఆయుధాలు, అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు.పోలీస్‌ స్టేషన్‌లో విధుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, శాఖలో ఉపయోగించే ఆయుధాలు, వాటి వినియోగం, భద్రతా జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. అత్యవసర సమయంలో డయల్‌ 112కు ఫోన్‌ చేస్తే సమాచారం స్వీకరించడం నుంచి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే వరకు అనుసరించే ప్రక్రియను తెలియజేశారు. పోలీసుల సమాచార మార్పిడికి ఉపయోగించే వీహెచ్‌ఎఫ్‌ వైర్‌లెస్‌ సెట్ల పనితీరును వివరించారు.కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు పోలీస్‌ శాఖలోని వివిధ హోదాలు, అధికారుల బాధ్యతలు, విధుల్లో క్రమశిక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు.పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, ప్రజలకు పోలీస్‌ వ్యవస్థను చేరువ చేయడం, యువతలో పోలీస్‌ విధులపై అవగాహన పెంపొందించడం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాల ఉద్దేశమని ఎస్‌ఐ తెలిపారు. విద్యార్థులు చట్టాలను గౌరవించాలని, క్రమశిక్షణతో మెలగాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్‌ శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగకరంగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *