వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా పరిపాలనా తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు.
- వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ప్రజా సంతృప్తి సర్వేల్లో జిల్లా రాష్ట్ర సగటును మించి 76.16 శాతం ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు.
- కలెక్టర్ హిమాన్షు శుక్లా నాయకత్వంలో జిల్లా అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
నెల్లూరు జిల్లా పరిపాలనా తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ప్రజా సంతృప్తి సర్వేల్లో జిల్లా రాష్ట్ర సగటును మించి 76.16 శాతం ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా నాయకత్వంలో జిల్లా అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందేలా అధికారులు పనిచేస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.