Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటాపోటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటాపోటీ

వార్త ముఖ్యాంశాలు

  • - కూటమి అభ్యర్థులుగా పొలంరెడ్డి దినేష్ రెడ్డి - కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్లు పరిశీలన - వైసీపీ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి జనరల్ రిజర్వ్ స్థానానికి కేటాయించబడ్డ నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి ఆశావహులు పోటీ పడుతున్నారు.
  • ఎంతో కీలకమైన ఈ పదవిని సాధించేందుకు అటు వైసీపీలోనూ, ఇటు కూటమిలోనూ పలువురు అభ్యర్థులు తమ పేర్లను పరిశీలనలోకి తీసుకోమంటూ ఆయా పార్టీల అగ్రనేతలను ఇప్పటికే కలిసి విన్నవించుకున్నట్లు సమాచారం.
  • అయితే ఇప్పటికే వైసీపీ ఆత్మకూరుకు చెందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలియవస్తోంది.

– కూటమి అభ్యర్థులుగా పొలంరెడ్డి దినేష్ రెడ్డి
– కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్లు పరిశీలన
– వైసీపీ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి

జనరల్ రిజర్వ్ స్థానానికి కేటాయించబడ్డ నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎంతో కీలకమైన ఈ పదవిని సాధించేందుకు అటు వైసీపీలోనూ, ఇటు కూటమిలోనూ పలువురు అభ్యర్థులు తమ పేర్లను పరిశీలనలోకి తీసుకోమంటూ ఆయా పార్టీల అగ్రనేతలను ఇప్పటికే కలిసి విన్నవించుకున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికే వైసీపీ ఆత్మకూరుకు చెందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలియవస్తోంది. ఇక కూటమి అభ్యర్థులుగా కోవూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు పొలంరెడ్డి దినేష్ రెడ్డి పేరును ముందు వరుసలో నిలిపి పరిశీలనలో పెట్టుకున్నట్లు తెలియవస్తోంది. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలియవస్తోంది.

అయితే పై రెండు పార్టీలు కూడా ఈ అభ్యర్థుల విషయంలో ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. వైసీపీకి అయితే బొమ్మిరెడ్డి పేరే దాదాపుగా ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *