Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు కార్పొరేషన్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం

వార్త ముఖ్యాంశాలు

  • - మేయర్‌గా పి.
  • రూప్ కుమార్ యాదవ్ - డిప్యూటీ మేయర్‌గా కూరపాటి రఘునాథరాజు ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నెల్లూరు నగర కార్పొరేషన్ నూతన పాలక మండలి సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది.
  • మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్‌గా కొరపాటి రఘునాథరాజు ప్రమాణ స్వీకారం చేశారు.

– మేయర్‌గా పి. రూప్ కుమార్ యాదవ్
– డిప్యూటీ మేయర్‌గా కూరపాటి రఘునాథరాజు
ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నెల్లూరు నగర కార్పొరేషన్ నూతన పాలక మండలి సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్‌గా కొరపాటి రఘునాథరాజు ప్రమాణ స్వీకారం చేశారు.

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరగగా, ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ చేత ప్రమాణ స్వీకారం చేయించగా, కార్పొరేషన్ పరిధిలో గెలిచిన 72 మంది కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం 60వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా ఎన్నికైన కూరపాటి రఘునాథరాజును కూటమి నేతలు ఎంపిక చేయడంతో, డిప్యూటీ మేయర్‌గా ఆయన ఎంపిక ఏకగ్రీవమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *