వార్త ముఖ్యాంశాలు
- --అందుకే అందుకున్న విజయం --ఆది నుంచి కూటమి వ్యూహాలతోనే పరుగులు రాష్ట్రంలోని 4వ అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిని గెలిపించుకోవడంలో కూటమి ఆది నుంచి ఒక ప్రణాళికతో ముందుకు సాగింది.
- కూటమి నాయకులు ఐక్యతా శంఖారావాన్ని వినిపిస్తూ తొలి నుంచి ఒక ప్రణాళికతో ముందుకు సాగి కూటమికి విజయాన్ని కైవసం చేశారు.
- రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.
–అందుకే అందుకున్న విజయం
–ఆది నుంచి కూటమి వ్యూహాలతోనే పరుగులు
రాష్ట్రంలోని 4వ అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిని గెలిపించుకోవడంలో కూటమి ఆది నుంచి ఒక ప్రణాళికతో ముందుకు సాగింది. కూటమి నాయకులు ఐక్యతా శంఖారావాన్ని వినిపిస్తూ తొలి నుంచి ఒక ప్రణాళికతో ముందుకు సాగి కూటమికి విజయాన్ని కైవసం చేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అలాగే బీజేపీ, జనసేన నాయకులు తదితరులు అంతా తమ తమ నేతలను, కార్యకర్తలను ఒకే బాట నడిపించి విజయాన్ని పొందారు.
పైన చెప్పిన వారు తమ కుటుంబాలకు చెందిన మహిళలను కూడా ప్రచార రంగంలోకి దింపి వీధి వీధి, ఇల్లిల్లు తిరిగేలా చేశారు. కాళ్లకు బలపం కట్టుకుని ఓటర్లను అభ్యర్థించారు.
అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల ప్రక్రియ వరకు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. నామినేషన్ల పరిశీలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రతిపక్షాల నామినేషన్లపై డేగ కన్ను వేసి నామినేషన్ల నాడే 8 డివిజన్లను ఏకగ్రీవం చేసుకుని ప్రజల హృదయాలలో విజయ పతాకం ఎగరవేశారు.
అక్కడి నుంచి ప్రచార పర్వంలో ఊపిరి సలపకుండా పోరు చేసి నగరాన్ని హోరెత్తించారు. టీడీపీ శ్రేణులకు ఏమాత్రం తగ్గకుండా బీజేపీ, జనసేనల కార్యకర్తలు కూడా రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని కష్టించి పని చేశారు.
ముఖ్యంగా కూటమి నుంచి మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రూప్ కుమార్ యాదవ్ తనకున్న రాజకీయ అనుభవాన్ని రంగరించి క్షేత్రస్థాయిలో కష్టించి పని చేశారు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అలకలను బుజ్జగిస్తూ ఎక్కడా అసమ్మతి తలెత్తకుండా ఎన్నికల యుద్ధాన్ని చేసి చివరకు మంచి మెజారిటీతో విజయం సాధించారు.
మంత్రి నారాయణ గత రెండున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రచార రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అనేక డివిజన్లలో ప్రచారం చేసి తనదైన శైలిలో నేతలను, ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.
అబ్దుల్ అజీజ్ ముస్లిం వర్గాలలో ఉత్సాహం నింపి వారి అభిమానాన్ని కూటమికి చేరువ అయ్యేలా చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలు తమ కుటుంబాలను సైతం రంగంలోకి దింపి రూప్ కుమార్ యాదవ్ విజయానికి కృషి చేశారు.
నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా తూర్పు ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అలాగే నగరంలోని తన అభిమానులను అంతా కూడగట్టి రూప్ కుమార్ విజయం కోసం శ్రమించారు.ఇక బీజేపీ శ్రేణులు పట్టు వదలని విక్రమార్కుడిలా పని చేసి తమ బీజేపీకి, అలాగే కూటమి అభ్యర్థులకు విజయం దక్కేలా కృషి చేశారు. ఇక పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు తమ జనసేన అభ్యర్థుల కోసమే కాకుండా మొత్తం కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రాణాలకు ఒడ్డి పోరాడారు.
ఇలా వీరందరి సమష్టి కృషి, సహాయ సహకారాల వల్లనే నెల్లూరు నగరంలో మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన రూప్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం సాధ్యమైంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్