Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నీళ్లరేవు వయా అడవిపేట రహదారి పనులకు శంకుస్థాపన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నీళ్లరేవు వయా అడవిపేట రహదారి పనులకు శంకుస్థాపన

వార్త ముఖ్యాంశాలు

  • శాసనసభ విప్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, రూ.
  • 10.67 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 19 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణానికి కాట్రేనికోన మండలం నీళ్లరేవు వయా అడవిపేట రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.చాలా ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక ఈ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రాంత ప్రజలు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులకు…
  • ఈ విషయంపై వెంటనే స్పందించిన ప్రభుత్వం రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించింది.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

శాసనసభ విప్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, రూ. 10.67 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 19 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణానికి కాట్రేనికోన మండలం నీళ్లరేవు వయా అడవిపేట రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.చాలా ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక ఈ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రాంత ప్రజలు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన ప్రభుత్వం రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించింది.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటికి శాశ్వత పరిష్కారాలు సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలే ప్రజల జీవితాల్లో నిజమైన మార్పుకు పునాది అని, నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, రాష్ట్ర నాయకులు నాగిడి నాగేశ్వరరావు,ముమ్మిడివరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ,కాట్రేనికోన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు పెసింగి రంగారావు వర్మ,సీనియర్ నాయకులు దండుప్రోలు సత్యం,బొమ్మిడి లింగేశ్వరరావు,మోకా అప్పాజీ,నరసింహమూర్తి,మోకా బాల ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మరియు అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *