వార్త ముఖ్యాంశాలు
- సత్యవేడు మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్ ఆధ్వర్యంలో శ్రీ కోనేటి ఆదిమూలం గారి ఆదేశాల మేరకు 17-07-2026 తేదీన అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 8 గంటల…
- ఇందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు, శ్రీ కోనేటి ఆదిమూలం గారు మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి, యువకుల కోసం శ్రీ సిటీ లోని 14 బహుళ జాతీయ కంపెనీలలో 500 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును అని గౌరవ ఎమ్మెల్యే గారు…
- ఇందులో భాగంగా జిల్లా లోని పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన వారికి కంపెనీ వైస్ గా సుమారు 2లక్షల రూపాయలు నుండి…
సత్యవేడు మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్ ఆధ్వర్యంలో శ్రీ కోనేటి ఆదిమూలం గారి ఆదేశాల మేరకు 17-07-2026 తేదీన అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 8 గంటల నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (సిఐఐ ఎంసీసీ ట్రైనింగ్ సెంటర్), ఫైర్ స్టేషన్ దగ్గర, శ్రీ సిటీ (Skill Development Centre(CII MCC Training Center),Back Side Fire Station, Sri City,Tirupati dist) నందు జరగబోయే జాబ్ మేళా సంబంధించి గౌరవనీయులైన శ్రీ కోనేటి ఆదిమూలం గారు, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా ఈరోజు జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది.
ఇందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు, శ్రీ కోనేటి ఆదిమూలం గారు మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి, యువకుల కోసం శ్రీ సిటీ లోని 14 బహుళ జాతీయ కంపెనీలలో 500 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును అని గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు.
ఇందులో భాగంగా జిల్లా లోని పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన వారికి కంపెనీ వైస్ గా సుమారు 2లక్షల రూపాయలు నుండి 10 లక్షల రూపాయల వరకు జీతభత్యాలు పొందగలుగుతారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు అని ఆర్ లోకనాథం గారు, జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి, తిరుపతి జిల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు.
రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/
ఈ కార్యక్రమంలో సత్యవేడు మండల డిప్యూటీ ఎం పి డి ఓ షణ్మగం గారు , బాలరాజు, ఈశ్వర్ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, జయశంకర్ రెడ్డి,రమణ గారు, భరణి బాస్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా నాయకుడు,చైతన్య ఎం పి ఎస్ ఎస్ డి సి సిబ్బంది ,రాజు అడ్వికేట్,కూటమి నాయకులు మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు