Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబ్ నగర్

నాలుక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాలుక

వార్త ముఖ్యాంశాలు

  • నాలుక మనిషి నోటి మాటలకు అందంగా అర్థం చెప్పేది నాలుక, అదే మాటలను విషంగా మార్చేది కూడా నాలుకే, మనసులోని భావాలకు మాటల రూపం ఇచ్చేది నాలుక, మంచి మాటతో మనసులు గెలిపిస్తుంది, చెడు మాటతో బంధాలను తెంచేస్తుంది, ఒక్క మాట జీవితాన్ని మార్చగలదు, ఒక్క మాట…
  • రచన : కె.మురళీమోహన్ రాజు, నెల్లూరు.
  • చరవాణి : 9866179385

నాలుక

మనిషి నోటి మాటలకు
అందంగా అర్థం చెప్పేది నాలుక,
అదే మాటలను విషంగా మార్చేది కూడా నాలుకే,
మనసులోని భావాలకు
మాటల రూపం ఇచ్చేది నాలుక,
మంచి మాటతో మనసులు గెలిపిస్తుంది,
చెడు మాటతో బంధాలను తెంచేస్తుంది,
ఒక్క మాట జీవితాన్ని మార్చగలదు,
ఒక్క మాట జీవితాన్ని నాశనం చేయగలదు,
అందుకే నాలుకను అదుపులో ఉంచాలి,
కోపంలో పలికిన మాట
కాలం గడిచినా గాయం చేస్తుంది,
ఆవేశంలో అన్న మాట
అనుబంధాలను దూరం చేస్తుంది,
అబద్ధపు మాట నమ్మకాన్ని చంపుతుంది,
అహంకారపు మాట మనిషిని ఒంటరి చేస్తుంది,
అసూయతో పలికిన మాట
మన విలువను మనమే తగ్గించుకుంటుంది,
నిజమైన మాటకు మాత్రం
ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది,
మధురమైన మాట మనసుకు మందులాంటిది,
ఓదార్పు మాట కన్నీటికి అడ్డుకట్ట,
ప్రేమగా పలికిన మాట బంధానికి బలమవుతుంది,
క్షమాపణ చెప్పే మాట గొప్పతనానికి నిదర్శనం,
మాటకు ముందు ఒక్కసారి ఆలోచించాలి,
ఎందుకంటే బాణం వెనక్కి రాదు,
అలాగే నోటి నుంచి జారిన మాట కూడా తిరిగి రాదు,
మనిషి నాశనమైన ప్రతి బంధంలో
నాలుక కూడా ఒక ముద్దాయిగా నిలుస్తుంది,
అందుకే నాలుకను జాగ్రత్తగా వాడితే
మనిషి జీవితం… బంధాలు… రెండూ అందంగా నిలుస్తాయి.

రచన : కె.మురళీమోహన్ రాజు, నెల్లూరు.
చరవాణి : 9866179385

Leave a comment

Your email address will not be published. Required fields are marked *