Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబ్ నగర్

జ్ఞానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జ్ఞానం

జ్ఞానం

సంపన్నులు ఎప్పుడూ
సాధారణంగానే దర్శనమిస్తారు,
తెలివైన వాళ్లు ఎప్పుడూ
నిరాడంబరంగానే ఉంటారు.

మెరుపుల బట్టలు వేసుకున్నంత మాత్రాన
మనిషి గొప్పవాడు కాడు,
మాటల్లో ఆడంబరం ఉన్నంత మాత్రాన
జ్ఞానం ఉన్నవాడు కాడు.

నువ్వు చూసే మనుషులను
వాళ్లు చేసే హంగులను చూసి
తొందరగా నిర్ణయించకు,
బయటి రూపం చూసి
లోపలి విలువను అంచనా వేయకు.

నిశ్శబ్దంగా ఉండేవాడిలో
నిండైన జ్ఞానం ఉండవచ్చు,
సాధారణంగా కనిపించేవాడిలో
అసాధారణమైన ప్రతిభ ఉండవచ్చు.

పెద్దగా చెప్పుకునేవాడు
పెద్దవాడై ఉండాల్సిన అవసరం లేదు,
మౌనంగా పనిచేసేవాడే
మహోన్నతుడై ఉండొచ్చు.

డబ్బు ఉన్నవాడు
దర్పం చూపించాల్సిన పనిలేదు,
తెలివి ఉన్నవాడు
తన గొప్పతనం చాటాల్సిన అవసరం లేదు.

మనిషి విలువను నిర్ణయించేది
అతని ఆస్తి కాదు,
అతని మాటలు కాదు,
అతని మంచితనమే
నిజమైన సంపద.

రచన : రెవెల్లి పద్మ
హనుమకొండ.
శివాని జూనియర్ కాలేజీ…

జ్ఞానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *