Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నారాయణవనం మండలం తుంబూరు గ్రామ కాజ్వే నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నారాయణవనం మండలం తుంబూరు గ్రామ కాజ్వే నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

వార్త ముఖ్యాంశాలు

  • నారాయణవనం మండలం తుంబూరు గ్రామంలోని కాజ్వే గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతినడంతో గ్రామ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
  • ఈ సమస్యను గుర్తించిన సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు కాజ్వేను స్వయంగా పరిశీలించి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
  • ఈ కాజ్వే నిర్మాణానికి ఇప్పటికే రూ.37 లక్షలు మంజూరు కాగా, పనులు పూర్తయ్యేందుకు అదనంగా రూ.20 లక్షలు మంజూరు చేయాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరారు.

నారాయణవనం మండలం తుంబూరు గ్రామంలోని కాజ్వే గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతినడంతో గ్రామ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ సమస్యను గుర్తించిన సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు కాజ్వేను స్వయంగా పరిశీలించి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ కాజ్వే నిర్మాణానికి ఇప్పటికే రూ.37 లక్షలు మంజూరు కాగా, పనులు పూర్తయ్యేందుకు అదనంగా రూ.20 లక్షలు మంజూరు చేయాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరారు.

శాసనసభ్యుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదనంగా రూ.20 లక్షలు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపినందుకు వారికి సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుంబూరు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *