വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ
- అక్టోబర్ 11 నుంచి 20 వరకు పలు ప్రత్యేక దర్శనాలు రద్దు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
- భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
- వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాలతో పాటు ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలను కూడా పది రోజుల పాటు నిలిపివేయనుంది.
అక్టోబర్ 11 నుంచి 20 వరకు పలు ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాలతో పాటు ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలను కూడా పది రోజుల పాటు నిలిపివేయనుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సాధారణ భక్తులకు సజావుగా దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏