Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నర్రవాడ ఉలవవారిపాలెంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నర్రవాడ ఉలవవారిపాలెంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

నర్రవాడ మజరా ఉలవవారిపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలను గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని పూలమాలలు, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వినాయకుడి కృపతో గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్థించారు. వేడుకల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

నర్రవాడ ఉలవవారిపాలెంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *