వార్త ముఖ్యాంశాలు
- నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ఈ సందర్భంగా ఆసుపత్రిలోని జనరల్ వార్డు, ప్రసూతి విభాగం, వైద్య పరీక్షల గదులను పరిశీలించారు.
- ఆసుపత్రిలో మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య పరిస్థితులు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని జనరల్ వార్డు, ప్రసూతి విభాగం, వైద్య పరీక్షల గదులను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య పరిస్థితులు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.