Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాట కోసం ఎంత దూరమైనా పోరాడే నాయకుడు నరేంద్ర రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మాట కోసం ఎంత దూరమైనా పోరాడే నాయకుడు నరేంద్ర రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 7 (పున్నమి ప్రతినిధి) గూడూరు రూరల్: గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎద్దల నరేంద్ర రెడ్డి మాటకు కట్టుబడి ప్రజల కోసం పనిచేసే నాయకుడని పోటిపాలెం గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఎద్దల ఫణీంద్ర రెడ్డి అన్నారు.
  • బుధవారం నరేంద్ర రెడ్డి 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని పోటిపాలెంలో ఫణీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
  • కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 7 (పున్నమి ప్రతినిధి)
గూడూరు రూరల్: గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎద్దల నరేంద్ర రెడ్డి మాటకు కట్టుబడి ప్రజల కోసం పనిచేసే నాయకుడని పోటిపాలెం గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఎద్దల ఫణీంద్ర రెడ్డి అన్నారు. బుధవారం నరేంద్ర రెడ్డి 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని పోటిపాలెంలో ఫణీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫణీంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజల పట్ల సేవాభావంతో నరేంద్ర రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *