Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

నందిపాడులో ఘనంగా రంజాన్ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

దుత్తలూరు
Date:21-3-2026
నందిపాడు: పవిత్ర రంజాన్ పండుగను నందిపాడు ప్రాంతంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వహించిన వారు ఈద్ సందర్భంగా ప్రత్యేక నమాజులు నిర్వహించారు.
ఉదయం నుంచే మసీదులకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అల్లాహ్‌కు ప్రార్థనలు చేశారు. పరస్పరం కౌగిలించుకుని “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు కొత్త దుస్తులు ధరించి ఆనందంగా పండుగను జరుపుకున్నారు.స్థానిక ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నందిపాడు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పండుగ నమాజ్ ముగిసింది.

నందిపాడులో ఘనంగా రంజాన్ వేడుకలు

నందిపాడులో ఘనంగా రంజాన్ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *