Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలంలో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు మండలంలో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం

దుత్తలూరు మండలంలోని ముత్తరాసిపల్లి, రాఘవరెడ్డిపల్లి, చింతలగుంట గ్రామాల్లో కూటమి అభ్యర్థులు విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా తనను, ఎంపీటీసీ అభ్యర్థిగా సింగవరపు సుధారాణిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల ఆదరణతో విజయం సాధిస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

దుత్తలూరు మండలంలో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *