Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో దుకాణంలో భారీ చోరీ.. గ్యాస్ సిలిండర్, నగదు సహా పలు వస్తువులు అపహరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరులో దుకాణంలో భారీ చోరీ.. గ్యాస్ సిలిండర్, నగదు సహా పలు వస్తువులు అపహరణ

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు.
  • దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు గ్యాస్ సిలిండర్, కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, ఉల్లిగడ్డల బస్తాతో పాటు కొంత నగదును అపహరించినట్లు సమాచారం.
  • గురువారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే దుత్తలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుత్తలూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు గ్యాస్ సిలిండర్, కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, ఉల్లిగడ్డల బస్తాతో పాటు కొంత నగదును అపహరించినట్లు సమాచారం. గురువారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే దుత్తలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, పరిసర ప్రాంతాల్లోని ఆధారాలను సేకరిస్తూ నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల్లో ఈ ఘటన కలకలం రేపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *