Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*దీపావలి పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపాలి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*దీపావలి పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపాలి*

వార్త ముఖ్యాంశాలు

  • *జాగ్రత్తలు పాటించి పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి* *రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన* మంత్రి ఆనం రామనారాయణరెడ్డి *పున్నమి ప్రతినిధి అక్టోబర్ 19 నెల్లూరు జిల్లా* రాష్ట్ర ప్రజలందరికీ ఈ దీపావళి పర్వదినం సంతోషాల సంబరం కావాలని, అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలని రాష్ట్ర…
  • దీపావళి పండుగ సందర్భంగా మంత్రి ఆనం ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు.
  • చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐకమత్యం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు.మన రాష్ట్రం మరోసారి వెలుగులదివ్వెలా ప్రకాశించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాది అవుతుందని మంత్రి ఆనం అన్నారు.ప్రజలందరూ తగిన…

*జాగ్రత్తలు పాటించి పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి*

*రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన*
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

*పున్నమి ప్రతినిధి అక్టోబర్ 19 నెల్లూరు జిల్లా*

రాష్ట్ర ప్రజలందరికీ ఈ దీపావళి పర్వదినం సంతోషాల సంబరం కావాలని, అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా మంత్రి ఆనం ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐకమత్యం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు.మన రాష్ట్రం మరోసారి వెలుగులదివ్వెలా ప్రకాశించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాది అవుతుందని మంత్రి ఆనం అన్నారు.ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు చాలా అప్రమత్తంగా వుండాలని మంత్రి సూచించారు. పెద్దపెద్ద శబ్దాలు చేసే బాణాసంచా కాకుండా వెలుగుపువ్వుల పర్యావరణహిత దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *