Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

దహేగాం మండలం కోత్మీర్ గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దహేగాం మండలం కోత్మీర్ గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

కొమురం భీం జిల్లా దహేగం మండలంలోని కొత్మీర్ గ్రామంలో పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తి నినాదాల మధ్య నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నాయికిని సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించగా. గ్రామ పెద్దలతో కలిసి మువ్వన్నెల జాతీయ జెండాకు ఘనంగా వందనం సమర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామాభివృద్ధి కోసం శ్రమిస్తున్న పలువురు ముఖ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దహేగాం మండలం కోత్మీర్ గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *