Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

దళిత సమస్యల పరిష్కారానికి ఛలో కలెక్టరేట్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దళిత సమస్యల పరిష్కారానికి ఛలో కలెక్టరేట్‌

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి,: దళిత గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి గ్రామంలో స్మశాన వాటికలకు అవసరమైన స్థలాలు, సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు.
  • సామాజిక శంఖారావంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో దళిత గ్రామాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పందికాళ్ల మణి, జిల్లా కమిటీ సభ్యులు కె.రంగయ్య, వెంకటాద్రి, టి.గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి,: దళిత గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి గ్రామంలో స్మశాన వాటికలకు అవసరమైన స్థలాలు, సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక శంఖారావంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో దళిత గ్రామాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పందికాళ్ల మణి, జిల్లా కమిటీ సభ్యులు కె.రంగయ్య, వెంకటాద్రి, టి.గురవయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర మౌలిక వసతులు మెరుగుపరచాలని వారు కోరారు. స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించి, ప్రహరీ, రహదారి, విద్యుత్‌, నీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.
అనంతరం దళితుల సమస్యలకు సంబంధించిన అర్జీలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. అర్హులైన దళిత కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని నాయకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *