Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

దళితులపై దాడులు నిందితులను రిమాండ్ చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దళితులపై దాడులు నిందితులను రిమాండ్ చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • 48 గంటల్లోగా నిందితులను తక్షణమే రిమాండ్ చేయాలి చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే రిమాండ్ చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు…
  • ఆదివారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షుడు చెలపాక ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.
  • దసరా ఉత్సవాల సందర్భంగా సంప్రదాయం ప్రకారం డప్పులు వాయిస్తూ గ్రామ పెద్దల ఇంటికి వెళ్తున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన బొమ్మరి కొమ్మాలు, ఆయన అనుచరులను కొందరు కులం పేరుతో దూషించి భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు.

48 గంటల్లోగా నిందితులను తక్షణమే రిమాండ్ చేయాలి

చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం

ఉప్పరపల్లి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే రిమాండ్ చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు మాంకాల యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షుడు చెలపాక ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. దసరా ఉత్సవాల సందర్భంగా సంప్రదాయం ప్రకారం డప్పులు వాయిస్తూ గ్రామ పెద్దల ఇంటికి వెళ్తున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన బొమ్మరి కొమ్మాలు, ఆయన అనుచరులను కొందరు కులం పేరుతో దూషించి భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. బాధితుల ఫిర్యాదుతో ఈ నెల 23న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ నిందితులను ఇప్పటివరకు రిమాండ్ చేయకపోవడం విచారకరమన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బాధితులను పరామర్శించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. పోలీసు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే స్పందించి 48 గంటల్లో నిందితులను రిమాండ్ చేయాలని, లేనిపక్షంలో కుల, ప్రజా సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బందేల అరుణ్ కుమార్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు, డివిజన్ నాయకుడు సాధు నర్సింగరావు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల నాయకుడు అలువాల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మంచాల హరీష్, ప్రధాన కార్యదర్శి మేకల చందు తదితరులు పాల్గొన్నారు

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *