Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్నారు.
  • ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై చర్చించారు.
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, దేవాదాయ శాఖ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, దేవాదాయ శాఖ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

స్టేట్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి తెలుగు లక్ష్మి ఎర్నిమాంబ అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ని ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా సీనియర్ నాయకుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం మానవీయ బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ రాజు, మాజీ డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *