Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

32 ఏళ్ల తర్వాత మళ్లీ బడి గూటికి… 1994 బ్యాచ్ అపూర్వ కలయిక!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
32 ఏళ్ల తర్వాత మళ్లీ బడి గూటికి… 1994 బ్యాచ్ అపూర్వ కలయిక!

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీహరిపురంలోని VT కాలేజ్ స్కూల్ లో 1994లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 32 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు.
  • నాటి చిన్ననాటి స్నేహితులందరినీ ఒక్కసారి కలవాలనే చిరకాల కోరిక ఎట్టకేలకు నేడు నెరవేరింది.
  • ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఒకప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్లిపోయిన వారంతా, ఈ వేడుక కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చారు.

శ్రీహరిపురంలోని VT కాలేజ్ స్కూల్ లో 1994లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 32 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. నాటి చిన్ననాటి స్నేహితులందరినీ ఒక్కసారి కలవాలనే చిరకాల కోరిక ఎట్టకేలకు నేడు నెరవేరింది.

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఒకప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్లిపోయిన వారంతా, ఈ వేడుక కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో NRI లుగా స్థిరపడిన వారు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా ఈ కలయికలో పాల్గొనడం విశేషం.

పాత స్కూల్ జ్ఞాపకాలు, స్నేహితులతో చేసిన అల్లరి, గురువుల ఆప్యాయతను గుర్తుచేసుకుంటూ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందంలో మునిగిపోయారు.

ఎన్ని ఏళ్లు గడిచినా తమ స్నేహబంధం చెక్కుచెదరలేదని నిరూపించిన ఈ కలయిక అందరికీ మధురానుభూతిని మిగిల్చింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *