Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తొలిసారి లడ్డూ వేలం.. రూ.71,116కు రోహిత్ సొంతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తొలిసారి లడ్డూ వేలం.. రూ.71,116కు రోహిత్ సొంతం

వార్త ముఖ్యాంశాలు

  • - కంపసముద్రం కందులవారిపల్లిలో ఘనంగా వినాయక లడ్డూ వేలంపాట - లడ్డూను ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లి..
  • తిరిగి ఆలయం వద్ద భక్తులకు ప్రసాదం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చిట్వేల్ మండలం కంపసముద్రం కందులవారిపల్లి గ్రామంలోని పాత రామాలయం వద్ద తొలిసారిగా నిర్వహించిన వినాయక స్వామివారి లడ్డూ వేలంపాట భక్తుల సందడి మధ్య ఉత్సాహంగా సాగింది.
  • వేలంపాటలో ఏదోటి శంకరయ్య, ఏదోటి ఈశ్వరమ్మ, (అల్లుడు) కందుల చిన్నరెడ్డయ్య, దివంగత కందుల తులసీమణి దంపతుల కుమారుడు కందుల రోహిత్ రూ.71,116కు లడ్డూను దక్కించుకున్నారు.

– కంపసముద్రం కందులవారిపల్లిలో ఘనంగా వినాయక లడ్డూ వేలంపాట

– లడ్డూను ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లి.. తిరిగి ఆలయం వద్ద భక్తులకు ప్రసాదం

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చిట్వేల్ మండలం కంపసముద్రం కందులవారిపల్లి గ్రామంలోని పాత రామాలయం వద్ద తొలిసారిగా నిర్వహించిన వినాయక స్వామివారి లడ్డూ వేలంపాట భక్తుల సందడి మధ్య ఉత్సాహంగా సాగింది. వేలంపాటలో ఏదోటి శంకరయ్య, ఏదోటి ఈశ్వరమ్మ, (అల్లుడు) కందుల చిన్నరెడ్డయ్య, దివంగత కందుల తులసీమణి దంపతుల కుమారుడు కందుల రోహిత్ రూ.71,116కు లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాట అనంతరం గ్రామ పెద్దలు, భక్తులు రోహిత్‌ను అభినందించారు. లడ్డూను తలపై ఉంచి డీజే, డ్రమ్స్‌తో ఆయన ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం కందుల రోహిత్ కుటుంబ సభ్యులు లడ్డూను తిరిగి ఆలయం వద్దకు తీసుకొచ్చి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. “నా సంపాదనలో దేవుడి కోసం ఒక రూపాయి కేటాయించాలనుకున్నాను. ఆ విఘ్నేశ్వరుడు ఈ రూపంలో స్వీకరించినట్లు భావిస్తున్నాను. తొలిసారిగా నిర్వహించిన వేలంపాటలో లడ్డూను దక్కించుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది” అని తెలిపారు. గ్రామంలో తొలిసారిగా లడ్డూ వేలంపాట నిర్వహించడం, అందులో కందుల రోహిత్ దక్కించుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కందుల రోహిత్, ఆయన కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, వినాయక స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *