పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు మండలం అల్లిమడుగు పంచాయతీ పరిధిలోని తెల్లగుంట గ్రామంలో కూటమి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి ఇందుపూరు పల్లవి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి తమకు మద్దతు ఇచ్చి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు. తాము విజయం సాధిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేసి, అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుపూరు రామ్మోహన్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్