వార్త ముఖ్యాంశాలు
- Date 26-10-2026 నెల్లూరు 🛑 తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అర్నబ్ తీవ్రతుపానుగా బలపడిందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
- ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందన్నారు.
- ప్రస్తుతానికి గోపాల్పూర్(ఒడిశా) 490 కి.మీ, విశాఖపట్నంకు 490 కి.మీ, కాకినాడకు 560 కి.మీ, మచిలీపట్నంకు 660 కి.మీ, బాపట్లకు 730 కి.మీ దూరంలో ఉందన్నారు.
Date 26-10-2026
నెల్లూరు
🛑 తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అర్నబ్ తీవ్రతుపానుగా బలపడిందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందన్నారు. ప్రస్తుతానికి గోపాల్పూర్(ఒడిశా) 490 కి.మీ, విశాఖపట్నంకు 490 కి.మీ, కాకినాడకు 560 కి.మీ, మచిలీపట్నంకు 660 కి.మీ, బాపట్లకు 730 కి.మీ దూరంలో ఉందన్నారు.
రానున్న 12 గంటల్లో అతి తీవ్రతుపానుగా బలపడి రేపు సాయంత్రం వరకు ఇది పశ్చిమవాయువ్య దిశగానే పయనించి, ఆ తర్వాత వాయువ్య దిశగా మలుపు తీసుకుంటుందని వివరించారు.
ఎల్లుండి ఉదయం బాపట్ల -విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు.
తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 115-125 కి.మీ గరిష్టంగా 140 కి.మీ వరకు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి విస్తారంగా వర్షాలు, చెదురుమదురుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కోస్తా తీరం వెంబడి 90-100కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెట్లు, భారీ హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని హెచ్చరించారు.
ప్రభుత్వ పరంగా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ప్రజలను ఆందోళన చెందకుండా సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే 8 ఎస్డీఆర్ఎఫ్ , 7ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని అదనంగా 3ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా నుంచి వచ్చిన 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఫైర్ డిపార్టమెంట్ కు చెందిన 115 ఉడ్ కటింగ్ , 13 బోటు రెస్క్యూ బృందాలు 76 ఆస్కా లైట్స్, 853 లైఫ్ బోయ్స్, 1328 లైఫ్ జాకెట్స్ తో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
వార్తా మూలాలు
- APSDMAపత్రికా ప్రకటన