Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తూ.గో: ఒకే చోట ఆత్మహత్యలు.. రెండున్నర నెలల్లో 13 మంది మృతి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తూ.గో: ఒకే చోట ఆత్మహత్యలు.. రెండున్నర నెలల్లో 13 మంది మృతి!

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని గోదావరి నదిపై ఉన్న వంతెనలు ప్రస్తుతం ఆత్మహత్యల నిలయాలుగా మారుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
  • నదిపై ఉన్న వివిధ వంతెనల నుండి దూకి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
  • గత రెండున్నర నెలల కాలంలోనే దాదాపు 13 మంది ఈ విధంగా నదిలోకి దూకి తనువు చాలించడం గమనార్హం.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని గోదావరి నదిపై ఉన్న వంతెనలు ప్రస్తుతం ఆత్మహత్యల నిలయాలుగా మారుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. నదిపై ఉన్న వివిధ వంతెనల నుండి దూకి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత రెండున్నర నెలల కాలంలోనే దాదాపు 13 మంది ఈ విధంగా నదిలోకి దూకి తనువు చాలించడం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఎక్కువ గోదావరి నదిపై ఉన్న కొవ్వూరు వంతెన మరియు చించి నాడ వంతెనల నుండి నదిలోకి దూకి ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య గత ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో అత్యధికంగా నమోదైంది. ప్రధానంగా అప్పుల బాధలు, కుటుంబ కలహాలు మరియు మానసిక ఒత్తిడి కారణంగానే పలువురు ఈ ఘాతుకాలకు ఒడిగడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అక్టోబర్ ప్రారంభంలో రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుండి ఒక యువకుడు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం చోటుచేసుకుంది. వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనలు అటు పోలీసు శాఖను, ఇటు స్థానిక యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. వంతెనలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *