వార్త ముఖ్యాంశాలు
- చెన్నై, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో మూలవిరాట్ అభిషేకంలో పాల్గొనే భక్తులపై ఆలయ యంత్రాంగం పలు ఆంక్షలు విధించింది.
- ఆలయ గర్భగుడి ప్రాంతం ఇరుగ్గా ఉండటంతో, ఏకకాలంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు లోపలికి వెళ్లినప్పుడు కొందరు శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
- ఈ పరిస్థితుల దృష్ట్యా మూలవిరాట్ అభిషేక సేవలో పాల్గొనే భక్తులకు గంట ముందే ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
చెన్నై, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో మూలవిరాట్ అభిషేకంలో పాల్గొనే భక్తులపై ఆలయ యంత్రాంగం పలు ఆంక్షలు విధించింది. ఆలయ గర్భగుడి ప్రాంతం ఇరుగ్గా ఉండటంతో, ఏకకాలంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు లోపలికి వెళ్లినప్పుడు కొందరు శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా మూలవిరాట్ అభిషేక సేవలో పాల్గొనే భక్తులకు గంట ముందే ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారిని అభిషేకంలో పాల్గొనేందుకు అనుమతించబోమని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా, వారాంతాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆదివారాల్లో సాధారణ భక్తులకు అభిషేక సేవలో పాల్గొనేందుకు ఎలాంటి అనుమతి ఉండదని వెల్లడించారు. భక్తుల ఆరోగ్య భద్రత, రద్దీ నియంత్రణ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ యంత్రాంగం పేర్కొంది.