Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తాళ్లూరు రోడ్డులోని శ్రీవారి (వెంకటేశ్వర స్వామి) వారి పాదాల వద్ద సత్యానంద స్వామికి కీర్తనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.

బోగోలు మండలం తాళ్లూరు రోడ్డులోని శ్రీవారి (వెంకటేశ్వర స్వామి) వారి పాదాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కీర్తనలు ఆలపించే సత్యానంద స్వామీజీ గారు , తాళ్లూరు రోడ్డు లో ఉన్న శ్రీవారి (వెంకటేశ్వర స్వామి) వారి పాదాల వద్ద భక్తి కీర్తనలు ఆలపించారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వామివారి కీర్తనలు ఆలపించడంతో ప్రాంగణం భక్తి వాతావరణంతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు భక్తిశ్రద్ధలతో కీర్తనలు ఆలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని బొడ్డు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

తాళ్లూరు రోడ్డులోని శ్రీవారి (వెంకటేశ్వర స్వామి) వారి పాదాల వద్ద సత్యానంద స్వామికి కీర్తనలు

తాళ్లూరు రోడ్డులోని శ్రీవారి (వెంకటేశ్వర స్వామి) వారి పాదాల వద్ద సత్యానంద స్వామికి కీర్తనలు

తాళ్లూరు రోడ్డులోని శ్రీవారి (వెంకటేశ్వర స్వామి) వారి పాదాల వద్ద సత్యానంద స్వామికి కీర్తనలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *